దాన్యం బస్తాల మాయంపై రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-05-09T05:50:27+05:30 IST

మండంలోని మోపాల్‌ ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని నర్సింగ్‌పల్లి గ్రామ రైతుల ధాన్యం బస్తాలు మాయమవడంపై ఆంధోళన వ్యక్తం చేశారు.

దాన్యం బస్తాల మాయంపై రైతుల ఆందోళన

మోపాల్‌, మే 8: మండంలోని మోపాల్‌ ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని నర్సింగ్‌పల్లి గ్రామ రైతుల ధాన్యం బస్తాలు మాయమవడంపై ఆంధోళన వ్యక్తం చేశారు. గత నెల 26వ తేదీన గ్రామానికి చెందిన 8 మందికి చెందిన 645 బస్తాలు రైస్‌మిల్లుకు వెళ్లగా అక్కడ 40 బస్తాలు తక్కువ వచ్చాయని చెప్పడంతో రైతులు మండిపడుతున్నారు. ఇక్కడ నుం చి సొసైటీ అఽధికారులే రైస్‌మిల్లుకు 645 బస్తాలు పంపించారని దీనికి సం బంధించిన రసీదులు కూడా ఉన్నాయని రైతులు వివరించారు. ధాన్యం బస్తాలు తక్కువ రావడంపై శనివారం రైతులు సొసైటీకి వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. బస్తాలు మాయమవడంపై వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను పట్టుపట్టారు. లారీ డ్రైవరే ఈ 40బస్తాలు మాయం చేసి ఉం టాడని ఆరోపించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యం బస్తాలు మాయవడం ఆశ్చర్యంగా ఉందని ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఈ విషయమై సొసైటీ అధికారులను సంప్రదించగా మాయమైన ధాన్యం బస్తాలపై ఆరాతీస్తున్నామని తెలిపారు. జరిగిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు డ్రైవర్‌ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనని కొట్టి లారీలో ఉన్న బస్తాలను ఎత్తుకెళ్లారని సొసైటీ సిబ్బందికి వివరించాడు. ఈ విషయంపై సొసైటీ పాలకవర్గం సభ్యులు, డైరెక్టర్‌లు మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-09T05:50:27+05:30 IST