రైతులు పండించిన ప్రతీ గింజనూ కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2021-10-21T06:23:02+05:30 IST

రైతులు పండించిన ప్రతీ గింజనూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.

రైతులు పండించిన ప్రతీ గింజనూ కొనుగోలు చేస్తాం
గుట్టలో పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత

యాదాద్రి రూరల్‌, అక్టోబరు 20: రైతులు పండించిన ప్రతీ గింజనూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గుట్టలో  కనీస మద్దతు ధరలవాల్‌ పోస్టర్‌ను బుధవారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు.  రైతులు దళారీల బారినపడి మోసపోకుండా అవసరమైన ప్రాంతాల్లో త్వరలో కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు అధైర్యపడవద్దని  ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు, డైరెక్టర్లు మామిడాల నర్సింహ, అనంతుల జంగారెడ్డి, బద్దు నాయక్‌, మంజుల, మల్లేశ్‌గౌడ్‌, మహేందర్‌రెడ్డి, సత్యనారాయణగుప్తా, రవీందర్‌గుప్తా, మిట్ట వెంకటయ్య, గంజి సూర్యనారాయణ, విఠల్‌ పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం: మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ 

ఆలేరు: ఆలేరు నియోజకవర్గంలోని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలో  ప్రారంభిస్తామని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌ గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ధాన్యం కొనుగోలు ధరల వాల్‌పోస్టర్‌ను  ప్రభుత్వ విప్‌ సునీతామహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ  సంద ర్భంగా రవీందర్‌గౌడ్‌ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన గిట్టు బాటు ధరలకే ధాన్యం కొనుగోలు చేయిస్తామన్నారు. ఈ సమావేశంలో మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు, డైరెక్టర్లు మామిడాల నర్సింహులు, అనంతుల జంగారెడ్డి, బద్దునాయక్‌, మంజుల, అయిలయ్య, కృష్ణ, మొగులగాని మల్లేశం, ఏసి రెడ్డి మహేందర్‌రెడ్డి, సత్యనారాయణగుప్తా, రవీందర్‌గుప్తా, మిట్ట వెంకటయ్య, గంజి సూర్యనారాయణ, విఠల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-21T06:23:02+05:30 IST