పత్తి విత్తనాలను తీసుకెళ్తున్న రైతులు
ఆదోని(అగ్రికల్చర్),
మే 20: రైతులతో విత్తనాలు, ఎరువులు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఆదోని
డివిజన్‌లోని రైతులే కాకుండా కర్ణాటకకు చెందిన రైతులు పత్తి విత్తనాల కోసం
భారీగా తరలివచ్చారు. దుకాణాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు
అవసరమైన పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారు. కర్ణాటకలోని షాపూరు,
శిరుగుప్ప, సింధనూరు, రాయచూరు ప్రాంతాలకు చెందిన రైతులు ఆదోనికి వచ్చి
పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.