Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 27 Sep 2021 10:42:55 IST

పంజాబ్, హర్యానా, బెంగాల్‌లో భారత్ బంద్

twitter-iconwatsapp-iconfb-icon
పంజాబ్, హర్యానా, బెంగాల్‌లో భారత్ బంద్

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాల బిల్లుకు వ్యతిరేకంగా రైతు సంస్థలు ఇచ్చిన 'భారత్ బంద్'  దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన బంద్ మధ్యాహ్నం 4 గంటల వరకూ కొనసాగనుంది. పంజాబ్, హర్యానాల్లో జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలు, లింక్ రోడ్లు, రైల్వే ట్రాక్‌లను రైతులు దిగ్బంధం చేశారు. రోడ్లు, రైల్ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పంజాబ్‌లో రైతులు 350కి పైగా ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్నారు. ప్రదర్శనా స్థలాల్లో శాంతి భద్రతల పరిస్థితిని కాపాడాలని పోలీసు బలగాలకు పంజాబ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏజీడీపీ) ఆదేశాలిచ్చారు. ధర్నా ప్రాంతాల వద్ద గట్టి నిఘా ఉంచారు. హర్యానాలోనూ హైవేలు దిగ్బంధం చేశారు. ఒక్క జింద్ జిల్లాలోనే 25 ప్రాంతాలను దిగ్బంధం చేశారు. పశ్చిమబెంగాల్‌లోనూ వామపక్షాలు బంద్‌కు దగడంతో రైళ్ల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడ్డాయి.

బంద్ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మూసి ఉంచాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. అయితే అత్యవసర సేవలైన ఆసుపత్రులు, మెడికల్ షాపులు, సహాయ, పునారావాస కార్యక్రమాలు, వ్యక్తిగత ఎమెర్జెన్సీ పనులకు హాజరయ్యే వారికి బంద్ నుంచి మినహాయింపు ఇచ్చింది. స్వచ్ఛందంగా, శాంతియుతంగా బంద్ పాటించాలని కోరింది.

కాగా, బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ బంద్‌కు మద్దతు ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ భారత్ బంద్‌లో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు కూడా బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయి. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.