సబ్‌ స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

ABN , First Publish Date - 2022-07-03T05:23:45+05:30 IST

సబ్‌ స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

సబ్‌ స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
ట్రాన్స్‌కో ఏఈకి వినతిపత్రం అందజేస్తున్న రైతులు

  • త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా సమయాన్ని పెంచాలని డిమాండ్‌

షాద్‌నగర్‌ అర్బన్‌, జూలై 2: ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్ద విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో సరఫరా సమయాన్ని పెంచాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రైతులు సబ్‌ స్టేషన్‌ను ముట్టడించారు. అవసరమున్న మేరకు కరెంట్‌ సరఫరా లేక సాగు పనులు కావడం లేదని భారీ సంఖ్యలో రైతులు సబ్‌ స్టేషన్‌కు తరలివచ్చారు. ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెబుతుంటే మొగిలిగిద్ద సబ్‌స్టేషన్‌ నుంచి మాత్రం రోజుకు ఎనిమిది, తొమ్మిది గంటల సరఫరా కూడా చేయడం లేదని రైతులు వాపోయారు. వానకాలం పంటకు వరినారు పోసుకొని కరిగెడు దున్నకానికి నీరు సరపోవడం లేదని తెలిపారు. కరెంట్‌ సరఫరా సమయాన్ని పెంచాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన ఏఈకి వినతిపత్రం ఇచ్చారు. పొలాల దున్నుకానికి అనుకూలంగా ఉండేలా విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతులు అన్మారి వెంకటయ్య, విజయ్‌కుమార్‌, రాములు, కె.బాల్‌రాజ్‌, మల్లేష్‌, కృష్ణ ఎం.వెంకటయ్య, ఆర్‌.కృష్ణ, జి.రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T05:23:45+05:30 IST