రైతుబంధు, రైతుబీమా వర్తింపజేయాలి

ABN , First Publish Date - 2020-09-17T11:26:13+05:30 IST

నర్సంపేట నియోజకవర్గంలో వాణిజ్య పంటలను సాగు చేసే రైతులకు రైతుబంధు, రైతుబీమా పథ కాలను వర్తింపజేయాలని ఎమ్మెల్యే పెద్ది

రైతుబంధు, రైతుబీమా వర్తింపజేయాలి

అసెంబ్లీలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి


నర్సంపేట, సెప్టెంబరు 16: నర్సంపేట నియోజకవర్గంలో వాణిజ్య పంటలను సాగు చేసే రైతులకు రైతుబంధు, రైతుబీమా పథ కాలను వర్తింపజేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం ఆయ న మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రైతులకు రైతుంబంధు కింద రూ. 248.30కోట్ల లబ్ది చేకూర్చిందన్నారు. నియోజ కవర్గంలో అకాల మరణం పొందిన 289 మంది రైతు కుటుంబాలకు రూ.14.45కోట్లను రైతుబీమా పథకం కింద అందజేసినట్లు తెలిపారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే నియోజకవర్గంలో అటవీ భూములను సేద్యం చేసుకునే గిరిజన, గిరిజనేతర రైతులు ఉన్నట్లు సభలో వివ రించారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూములు కూడా ఉన్నాయన్నారు. ఆర్‌ఎస్‌ఆర్‌ భూముల లెక్కలు తేలాల్సి ఉందన్నారు. పీవోటీ భూములను గుర్తించాల్సి ఉందన్నారు. రెవె న్యూ, అటవీ భూముల లెక్కలు తేలకపోవడంతో జాయింట్‌ సర్వేల ద్వారా పాఖాల ఆయకట్టు రైతులతో పాటు అనేక మంది రైతులకు రైతుబంధు వర్తించడం లేద న్నారు. రెండు, మూడు చోట్ల భూములు ఉండి ఖాతాలు కలిగి ఉన్న రైతులకు ఒక ఖాతాలో డబ్బులు రావడం మరో ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం వంటి సమ స్యలు ఉన్నాయని వీటిని పరిష్కరించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2020-09-17T11:26:13+05:30 IST