నర్సరీలతో నష్టపోతున్న రైతన్నలు

ABN , First Publish Date - 2022-05-23T05:13:51+05:30 IST

వ్యవసాయం భారంగా మారింది. పంట మార్పి డి చేసినా ధర లేక ప్రకృతి వైపరిత్యాలతో చేతికి అందివచ్చిన పం ట నేలపాలవుతోంది.

నర్సరీలతో నష్టపోతున్న రైతన్నలు
పెండ్లిమర్రిలో ఏర్పాటు చేసిన నర్సరీ

సబ్సిడీకి మంగళం 

పెట్టుబడి రాక అప్పుల పాలు 

నర్సరీలకు రిజిస్టర్‌ తప్పనిసరి : అధికారులు

పెండ్లిమర్రి, మే 22: వ్యవసాయం భారంగా మారింది. పంట మార్పి డి చేసినా ధర లేక ప్రకృతి వైపరిత్యాలతో చేతికి అందివచ్చిన పం ట నేలపాలవుతోంది. కొందరు రై తులు పంటలు, నర్సరీలు ఏర్పా టు చేశారు. ప్రభుత్వం నుంచి స బ్సిడీ రుణం అందుతుండడం ఉ ద్యాన సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో నర్సరీలను ఏర్పాటు చే  శారు. అయితే ఇప్పుడు ఆ నర్సరీ లే రైతుల కొంపముంచుతున్నా యి. ప్రభుత్వం సబ్సిడీ ఎత్తి వేయడంతో కనీ స పెట్టుబడులు రాక రైతులు అప్పులపాలవుతున్నారు. మండలంలో ఉద్యాన పంటలైన అరటి, బొప్పాయి.

చామంతి, కూరగాయలు, పలు రకాల పూలను ఎక్కువ సాగు చేస్తా రు. గతంలో దీనికి అవసరమైన మొక్కలను కడియం, సేలం, మధురై, దుండిగల్‌, రైల్వే కోడూరు తదితర దూర ప్రాంతాల నుంచి  వ్యయప్రయాసలు ఓర్చి తెచ్చుకున్నారు. అధికారంలో ఉన్న పాలకులు కడప జిల్లాను హార్టీకల్చర్‌  హబ్‌గా మారుస్తామని చెప్పడంతో ఉద్యాన పంటలకు డిమాండ్‌ ఏర్పడిం ది. ప్రభుత్వం కూడా నర్సరీలను ప్రోత్సహి స్తూ సబ్సిడీ ఇచ్చేది. దీంతో దూర ప్రాంతాల కు వెళ్లకుండా చామంతి, మిరప,  వంగ, తదితర డిమాండ్‌ ఉన్న పంట నర్సరీల ఏ ర్పాటుకు రైతులు పూనుకున్నారు.

శ్రీనివాసపురం, వెల్లటూరు, పెండ్లిమర్రి, మిన్నయ్యగారిపల్లె, చెర్లోపల్లె, రంపతాడు, తదితర గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. ఇందుకు ఎకరాకు రూ.10 లక్షల ఖర్చు అవుతోంది. ఫస్టు నర్సరీల్లో రైతులు లాభాలు పొందేవారు. సబ్సిడీని ఎత్తివేయడం నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు నష్టపోతున్నా రు. పంటలను సాగు చేసి నష్టపోయామనుకుంటే ఇప్పుడు నర్సరీలతో రాత మారుతుందనుకుంటే దీంతో కూడా అప్పుల పాలయ్యామని రైతులు వాపోతున్నారు. మండలంలో దాదాపు 20 నర్సరీల ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆరు నర్సరీలే అందుబాటులో ఉన్నాయి. 

నర్సరీలను రిజిస్టర్‌ 

చేయించుకోవాలి

 నర్సరీలు ఏర్పాటు చేసే రైతులు ఖచ్చితంగా ఉద్యానశాఖలో రిజిస్టర్‌ చేయించుకోవాలని ఉద్యానశాఖాధికారి సిందూరి పేర్కొన్నారు. రిజిస్టర్‌ చేయించుకుంటేనే ప్రభుత్వ సబ్సిడీ లు అందుతాయన్నారు. మొక్కలను నర్సరీలో అమ్మాలన్నా రిజిస్టర్‌ తప్పని సరిగా చేయించుకోవాలని మండలంలో ఇప్పటి వరకు 3 నర్సరీలు మాత్రమే రిజిస్టర్‌ అయ్యాయని తెలిపారు. 


Updated Date - 2022-05-23T05:13:51+05:30 IST