Abn logo
Sep 27 2021 @ 00:02AM

నాటిన మొక్కలు సంరక్షించే బాధ్యత రైతులదే

రైతులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఈడీ శ్రీధర్‌బాబు

పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్‌బాబు


నాగులుప్పలపాడు(ఒంగోలురూరల్‌), సెప్టెంబ రు 26 : నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బా ధ్యత రైతులు తీసుకోవాలని పొగాకు బోరుడ ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు ఆదివారం నాగు లుప్పలపాడు మండలం ఓబన్నపాలెం గ్రామంలో ఆదివారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొ క్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఈడీ మాట్లాడుతూ వృక్షాలు ఉంటే సకాల ంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాలుష్య ని వారణకు మొక్కలదే ప్రధానపాత్రం అని చెప్పారు. పొగాకు రైతులు పెద్దఎత్తున మొక్కలు నాటాలని కోరారు. అనంతరం ఇనమనమెళ్లూరు, చీర్వానుప్ప లపాడు, సూరారెడ్డిపాలెం గ్రామాల్లో రైతులతో మొక్కలు నాటించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్‌ ఎం బి.మంజునాఽథ్‌, ఆక్షన్‌ మేనేజర్‌ కె.రామకృష్ణ, ఐటీసీ లీఫ్‌ మేనేజర్‌ శివకుమార్‌, రైతు నాయకు లు వడ్డెళ్ల ప్రసాద్‌, పెనుబోతు సునీల్‌, కట్టా వెం కటేశ్వర్లు, కట్టా అందెయ్య, సర్పంచ్‌ పోలినేని వెం కటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.