కాంగ్రెస్‌ పార్టీకి రైతులు రెండు కళ్లలాంటి వారు...

ABN , First Publish Date - 2022-05-25T05:37:59+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీకి రైతులు, రైతు కూలీలు రెండు కళ్లలాంటివారని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఒకే సారి రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని ఎమ్మెల్సీ టీ. జీవన్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి రైతులు రెండు కళ్లలాంటి వారు...
రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ

రచ్చబండ రైతు డిక్లరేషన్‌లో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

బీర్‌పూర్‌,మే 24: కాంగ్రెస్‌ పార్టీకి రైతులు, రైతు కూలీలు రెండు కళ్లలాంటివారని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఒకే సారి రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని ఎమ్మెల్సీ టీ. జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం బీర్‌పూర్‌ మండలంలోని కొల్వాయి గ్రామంలో పార్టీ ఆధ్వ ర్యంలో చేపట్టిన రచ్చబండ రైతు డిక్లరేషన్‌ కార్యక్రమానికి ముఖ్య అధి తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 2014లో కాం గ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏవిధంగా పథకాలు ఉన్నాయో మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తే అదేవిధంగా ధరల నియంత్రణ ఉంటుందని పెట్రోల్‌ లీలటర్‌ 75, డీజిల్‌ లీటర్‌ 55, వంట గ్యాస్‌ 455 రూ పాయలకు ఇప్పించే భాధ్యత తీసుకుంటామని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని కూలీలకు రవాణ సౌక ర్యాలు, తాగు నీటి ఏర్పాటు, టెంటు లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయా ల్సింది పోయి గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్‌ కార్టు కలిగి ఉన్న ప్రతి ఒక్క ఉపాధి కూలీకి నెలకు 12000 చొప్పున సహాయం అందిస్తామని, ఈ హామీని గొడలపై రాయించాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారని జి ల్లా మంత్రి ఇప్పటి వరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతు ల ఇబ్బందులు తెలుసుకున్నారో చెప్పాలన్నారు. రైతుల నుంచిబస్తాపై 5 కిలోల నుంచి7కిలోల వరకు మిల్లర్లు దోసుకుంటున్నారని ఈ వ్యవహా రం చూస్తే మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కైందని అర్థమౌతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్‌, జడ్పీటీసీ పాత పద్మ రమేష్‌, వైస్‌ ఎంపీపీ లక్ష్మన్‌ రావ్‌, కో ఆప్షన్‌ మెంబర్‌ బీబా, సింగిలివిండో చైర్మన్‌ నవీ న్‌రావ్‌, ఎంపీటీసీలు, కాంగ్రెస్‌ పార్టీ ప్రచారకమిటీ కన్వీనర్‌ గుడిసె జితేం ధర్‌ యాదవ్‌, మండల పార్టీ అధ్యక్షులు చెరుపూరి సుభాష్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి కమలాకర్‌, ఉపాధ్యక్షులు జోగిరెడ్డిలతో పాటు ఆయా గ్రామాల నాయకలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Updated Date - 2022-05-25T05:37:59+05:30 IST