ప్రజలంతా ఒక్కటై.. సంకల్పం తోడై..

ABN , First Publish Date - 2020-09-20T08:10:17+05:30 IST

అది బిహార్‌లోని ఓ మారుమూల పల్లెటూరు. పేరు బుధౌలి. ఆ గ్రామస్థులు ఊరు దాటాలంటే.. ఏరు దాటాల్సిన స్థితి. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు ఆ ఏట్లో కలిసిపోయాయి...

ప్రజలంతా ఒక్కటై.. సంకల్పం తోడై..

గయా (బిహార్‌), సెప్టెంబరు 19: అది బిహార్‌లోని ఓ మారుమూల పల్లెటూరు. పేరు బుధౌలి. ఆ గ్రామస్థులు ఊరు దాటాలంటే.. ఏరు దాటాల్సిన స్థితి. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు ఆ ఏట్లో కలిసిపోయాయి. దీంతో.. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు ఆ ఏరుపై బ్రిడ్జి నిర్మించాలని 1992లోనే అప్పటి ప్రభు త్వం సంకల్పించింది.


పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఏమైందో ఏమో.. అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నాటి నుంచీ గ్రామస్థులు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ, వారి గోస పట్టించుకునే నాయకుడే లేకపోయాడు. ఈ మధ్యనే ఓ ముగ్గురు విద్యార్థులు ఆ ఏరు దాటే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. ఇక ప్రభుత్వాన్ని నమ్ముకుంటే లాభంలేదని భావించిన గ్రామస్థులు.. తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నారు. ఇందుకోసం విరాళాలు సేకరించారు.  దాదాపు మూడు దశాబ్దాలుగా ముందుకు కదలని పనులు తిరిగి మొదలయ్యాయి.  వంతెన నిర్మాణం పూర్తయితే.. గ్రామం నుంచి మండల కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. 


Updated Date - 2020-09-20T08:10:17+05:30 IST