Abn logo
Apr 12 2021 @ 23:45PM

మండుటెండలో మోకాళ్లపై రైతుల నిరసన

నాయుడుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట మండుటెండలో మోకాళ్లపై నిరసన తెలియజేస్తున్న రైతులు

నాయుడుపేట, ఏప్రిల్‌ 12 : మేనకూరు సెజ్‌కు రివర్స్‌ టెండరు ద్వారా చేసిన భారీ రింగ్‌ రోడ్డు ప్రతిపాదనతో తమకు నష్టం జరుగుతుందని రైతులు నాయుడుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం మండుటెండలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. భారీ ఫ్లైవోర్‌ నిర్మాణంతో 82.75 ఎకరాల మాగాణి భూములు, పరోక్షంగా ఎన్నో భూములను కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పండ్లూరు క్రాస్‌ రోడ్డు జాతీయ రహదారి నుంచి ఉన్న పాత ప్రతిపాదనలే కొనసాగించాలని కోరారు. ఈ భారీ ఫ్లైవోర్‌ ద్వారా మూడు గ్రామాల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంటుందన్నారు. ప్రభుత్వం కనికరం చూపి పాత సెజ్‌రోడ్డు విధానాన్నే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో పండ్లూరు, అయ్యప్పరెడ్డిపాళెం, వెంగమాంబపురం రైతులు దండిగుంట శ్రీనివాసమూర్తి, మల్లి సుధాకర్‌, అనిల్‌రెడ్డి, వేణుగోపాల్‌, ఎల్‌ దశయ్య, పీ. తేజ, వై వేణుగోపాల్‌రెడ్డి, వై. రాఘవరెడ్డి, కె. చంద్రశేఖర్‌రెడ్డి, ఎ. మస్తాన్‌రెడ్డి, సుంకర చెంచయ్య, బి. యుగంధర్‌రెడ్డి, టి. వీరనారాయణరెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement