రైతుబంధు ఖాతాలు పెండింగ్‌లో ఉండొద్దు

ABN , First Publish Date - 2020-07-16T09:45:24+05:30 IST

కొత్తగా రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాలు పరిశీలించిన వెంటనే నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

రైతుబంధు ఖాతాలు పెండింగ్‌లో ఉండొద్దు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ 


వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌, జూలై 15: కొత్తగా రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాలు పరిశీలించిన వెంటనే నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. రెండు రోజుల్లో ఒక్క ఖాతా కూడా పెండింగ్‌లో ఉండటానికి వీలులేదని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపాధి హామీ, రైతుబంధు, రైతు కల్లాలు, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో శానిటేషన్‌ అభివృద్ధి అంశాలపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి నివేదికలు పెండింగ్‌ ఉండరాదన్నారు.


కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ జిల్లాలో రైతుబంధు ఖాతాలు పెండింగ్‌లో లేవని తెలిపారు. రైతు వేదికలు 40 క్లస్టర్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. నగరంలో 36 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఉపాధి హామీ ద్వారా పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌ పనులు చేస్తున్నామని వివరించారు. ఈ వీసీలో నగర పాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పతి, డీఆర్‌డీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-16T09:45:24+05:30 IST