రైతు సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2022-05-22T04:59:09+05:30 IST

ఎనిమిదేళ్ల దుర్మార్గపు టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేశారని, త్వరలోనే వీరి పాలన అంతకావడంతో పాటు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తోందని ఆ పార్టీ నాయకులు దీమా వ్యక్తం చేశారు.

రైతు సంక్షేమమే ధ్యేయం
బండగొండలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు

- రచ్చబండలో కాంగ్రెస్‌ నాయకులు

నారాయణపేట, మే 21 : ఎనిమిదేళ్ల దుర్మార్గపు టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేశారని, త్వరలోనే వీరి పాలన అంతకావడంతో పాటు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తోందని ఆ పార్టీ నాయకులు దీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ పిలుపులో భాగంగా వరంగల్‌ డిక్లరేషన్‌పై శనివారం నారా యణపేట మండలం బండగొండలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టి ఈ ప్రాంతానికి సాగు, తాగు నీరు ఇస్తామని చెప్పి టీఆర్‌ ఎస్‌ నాయకులు వాగ్ధానాలు చేసి అధికారంలోకి వ చ్చారని, ఇచ్చిన వాగ్ధానాలు నేటికీ నెరవేర్చలేదన్నారు. దళితులకు దళిత బంధు ద్వారా పది లక్షలు ఇ స్తామని ప్రకటించి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, ఇందిరమ్మ పథకం ద్వారా నిరుపేదలకు కాంగ్రెస్‌ పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వగా టీఆర్‌ఎస్‌ పాలనలో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఎక్కడా కన్పించడం లేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాపీ, ఇందిరమ్మ రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందిస్తామ న్నారు. పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ధరణి పోర్టల్‌ రద్దుచేసి రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తా మన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ఎండీ గౌస్‌, సదా శివారెడ్డి, బాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, స లీం, శరణప్ప, విజయ్‌, జలీల్‌, తిరుమలేష్‌, రాం చందర్‌, భీమప్ప, పాల్గొన్నారు.

నర్వ : మండలంలోని నాగిరెడ్డిపల్లెలో శనివారం కాండ్రెస్‌ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం ని ర్వహించారు. ఈ కార్యక్రమానికి మక్తల్‌ నియోజకవర్గ నాయకుడు ప్రశాంత్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, రాజుల ఆశిరెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోని రాగానే ధాన్యానికి రూ.2500 మద్దతు ధరతో ప్రభుత్వమే కొంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టారు. పేదలకు స్థిరాస్తుల పట్టా లిచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. కార్యక్ర మంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు టీవీఎస్‌ చెన్న య్య సాగర్‌, జిల్లా నాయకులు నాగన్నగారి శీనివాస్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శరణప్ప, అయ్యపురెడ్డి, బుడ్డన్న పాల్గొన్నారు.

ఊట్కూర్‌ : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం మండలంలోని ఎర్గట్‌పల్లిలో గడపగడపకు వరంగల్‌ డిక్లరేషన్‌ చేర్చే కార్యక్రమాన్ని ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రచ్చబండ నిర్వహించిన కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాలను వరంగల్‌లో సభలో ప్రకటించారని వివరించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు దాసరి మధు, సాజీద్‌ హుస్సేన్‌, రవికుమార్‌ కతల్‌పాషా, వెంకటప్ప, శ్రీకాంత్‌, నవీన్‌కుమార్‌, తిమ్మప్ప పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T04:59:09+05:30 IST