Abn logo
Sep 24 2021 @ 23:47PM

రైతు వేదికలు ఆధునిక దేవాలయాలు

రైతు వేదికను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆల

- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి


దేవరకద్ర, సెప్టెంబరు 24 : గ్రామాల్లో నిర్మించిన రైతు వేదిక భవ నాలు రైతులకు ఆధునిక దేవాలయాలని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని డోకూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతువేదికను ఆయన ప్రారంభించి మాట్లాడారు.  పాలమూర్‌-రంగారెడ్డి పథకం ద్వారా జిల్లాలోని అన్ని చెరువులను నిం పి సాగునీరు అందిస్తామన్నారు. శ్రీశైలం తిరుగు జలాల ద్వారా కోయి ల్‌సాగర్‌, జయమ్మసాగర్‌, జూరాలను నింపి జిల్లాలో ఎండాకాలంలో కూడా చెరువులు అలుగు పారెలా చర్యలు తీసుకుంటామన్నారు. అనం తరం వాల్మీకి భవనాన్ని ప్రారంభించి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ అన్నపూర్ణ, మార్కెట్‌ చైర్మన్‌ కొండ సుగుణ, పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నర సింహారెడ్డి, రైతు సమన్వయ అధ్యక్షుడు కొండారెడ్డి, సింగిల్‌విండో చైర్మ న్‌ నరేందర్‌రెడ్డి, సర్పంచ్‌ నాయకులు శ్రీకాంత్‌యాదవ్‌, కొండ శ్రీను, భాస్కర్‌  పాల్గొన్నారు.