Abn logo
Oct 19 2021 @ 02:47AM

రాజధాని రైతు ఆత్మహత్యాయత్నం

విజయవాడ, అక్టోబరు 18: రాజధాని గ్రామం ఐనవోలుకు చెందిన ముఖమాటం సుబ్బారావు (48) సోమవారం విజయవాడలోని అమరావతి మెట్రోపాలిటన్‌ రీజనల్‌ అథారిటీ  (అమర్డా) కార్యాలయం వద్ద సోమవారం డీజిల్‌ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సుబ్బారావు మందడంలో తనకున్న సుమారు రెండు ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌లో రాజధానికి ఇచ్చాడు. దానికి సంబంధించిన ప్రయోజనాలు తనకు అందండంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ డీజిల్‌ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న వారంతా అడ్డుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.