రైతు వేదిక పనులను వేగంగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-09-26T10:37:08+05:30 IST

రైతు వేదిక నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ హన్మంతరావు అధికారులకు సూచించారు

రైతు వేదిక పనులను వేగంగా పూర్తి చేయాలి

వర్షంలోనే పనులను పరిశీలించిన కలెక్టర్‌ 


నారాయణఖేడ్‌, సెప్టెంబరు 25: రైతు వేదిక నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ హన్మంతరావు అధికారులకు సూచించారు. శుక్రవారం ఖేడ్‌ మండలం చందాపూర్‌లో నిర్మాణంలో ఉన్న రైతు వేదిక పనులను కలెక్టర్‌ ఆకస్మీకంగా సందర్శించి, పరిశీలించారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో పాటు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని వారిని ఆదేశించారు. వర్షంలోనే కలెక్టర్‌ అభివృద్ధి పనులను పరిశీలించారు. 


మనూరు : జిల్లాలోని ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణం పనులను అక్టోబరు 5 వరకు పూర్తి చేయాలని కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు. శుక్రవారం మండలంలోని రాయిపల్లి, తోర్నాల్‌ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణం పనులను పరిశీలించారు. 


నాగల్‌గిద్ద : రైతు వేదిక నిర్మాణం పనులను నాణ్యతతో పాటు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ హన్మంతరావు అధికారులకు సూచించారు. శుక్రవారం మండలంలోని మావినెల్లి, మోర్గి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణం పనులను అకస్మికంగా తనిఖీ చేసి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఖేడ్‌ ఆర్డీవో అంబాదాస్‌ రాజేశ్వర్‌, ఏడీఏ కరుణాకర్‌రెడ్డి, ఖేడ్‌ జడ్పీటీసీ లక్ష్మీబాయి, విజిలెన్స్‌ కమిటీ సభ్యులు రవీందర్‌నాయక్‌, మనూరు మండల ఏవో శ్రీనివాస్‌, ఎంపీడీవో షాజీలొద్దీన్‌, సర్పంచులు రాంచందర్‌,  శివలింగప్ప, నాగల్‌గిద్ద ఎంపీడీవో బాలయ్య, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీవో నరేశ్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-09-26T10:37:08+05:30 IST