రైతువేదిక నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-08-15T10:17:19+05:30 IST

ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మా ణ పనులను శుక్రవారం కలెక్టర్‌ భారతి హొళికేరి పరిశీలించారు

రైతువేదిక నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

జన్నారం/దండేపల్లి, ఆగస్టు 14: ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మా ణ పనులను శుక్రవారం కలెక్టర్‌ భారతి హొళికేరి పరిశీలించారు. జన్నారం, తిమ్మా పూర్‌, కిష్టాపూర్‌, చింతగూడ, ఇందన్‌పల్లిలో నిర్మిస్తున్న రైతు వేదికలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు వేదిక పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వర్షాకాలం నేపథ్యంలో పనులు మరింత వేగవంతం చేయాలని అన్నారు. వీటి ద్వారా రైతులకు లబ్ధి జరుగుతుందన్నారు. మండలంలో నిర్మించే రైతు వేదికలను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని, లేకుంటే చర్యలు తప్పవ న్నారు. తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీఓ అరుణారాణి, సిద్దిమల్ల భరత్‌కుమార్‌, మున్వర్‌, ముత్యం సతీష్‌, సర్పంచ్‌ జక్కు భూమేష్‌ ఉన్నారు. 


దండేపల్లి మండలం లింగాపూర్‌, మ్యాదరిపేట, ద్వారక, దండేపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. రైతు వేదిక ద్వారానే వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు అందుతాయన్నారు. సెప్టెంబర్‌లోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లోని పల్లె పార్క్‌లతో పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు గ్రామస్థులు సేద తీరడానికి  ఉపయోగపడుతాయన్నారు. వివిధ గ్రామాల్లో చేపట్టే నిర్మాణ పనులపై కలెక్టర్‌ అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, కాసనగోట్లు లింగన్న, సర్పంచులు,  అధికారులు పాల్గొన్నారు.   

Updated Date - 2020-08-15T10:17:19+05:30 IST