Abn logo
Aug 5 2020 @ 04:17AM

రైతు వేదిక నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలి

జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి


మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 4 : రైతు వేదిక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని  జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో వీడి యో కాన్ఫరెన్‌ ్స ద్వారా డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్‌ డీవో శేషాద్రితో కలిసి ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులు ఉపాధిహామీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లె ప్రగతి వనాలు ఏర్పాటు చేసేందుకు 20 గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించి పనులు ప్రారంభించడంతోపాటు వీటి చుట్టూ బయో ఫె న్సింగ్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు.  డంపింగ్‌ యార్డు, వైకుంఠధామం ఏర్పాటు పనులు ఈనెల31 వ తేదీలోగా పూర్తిచేయాలని, ప్రతి ఇంటిలో ఈనెల 15 వతేదీ లోగా ఇంకుడు గుంత ఉండేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా రోజు  చెత్త సేకరణ చేయాలన్నారు. హరితహారం లక్ష్యాలను వెంటనే పూర్తిచేయాలని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement