Advertisement
Advertisement
Abn logo
Advertisement

రామారెడ్డిలో పురుగుల మందు డబ్బాతో రైతు ఆందోళన

కామారెడ్డి: తన పొలంలో అధికారులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారంటూ ఓ రైతు పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో జరిగింది. రోడ్డు పక్కన మొక్కలు నాటాలని అధికారులను కలెక్టర్ శరత్ ఆదేశించారు. దీంతో రామారెడ్డిలో రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటారు. పంట పొలం ఉందని ముందుగా నోటీసులివ్వాలని ఆలోచించకుండా వరి పొలంలో ప్రొక్లయినర్‌తో గుంతలు తీసి మొక్కలు నాటారు. ఆ మట్టిని పొలంలోనే వదిలేశారు. అధికారుల తీరుతో నష్టపోయిన రైతు ధర్నాకు దిగారు. తనకు నష్టపరిహారం చెల్లించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని రైతు హెచ్చరించారు. 

Advertisement
Advertisement