తన భూమిని కబ్జా చేశారంటూ పురుగుల మందుతో..

ABN , First Publish Date - 2020-08-04T01:21:13+05:30 IST

తన భూమిని కబ్జా చేశారంటూ ఓ రైతు పురుగుల మందతు డబ్బా పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ ఘటన జిల్లాలోని నందిగామ మండలంలో చోటు చేసుకుంది.

తన భూమిని కబ్జా చేశారంటూ పురుగుల మందుతో..

కృష్ణా: తన భూమిని కబ్జా చేశారంటూ ఓ రైతు పురుగుల మందతు డబ్బా పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ ఘటన జిల్లాలోని నందిగామ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. నందిగామ మండలం చందాపురం గ్రామంలో సర్వే నంబర్ 57లో గల 1.84 సెంట్ల భూమిని కబ్జా చేశారని ఓ రైతు ఆరోపించాడు. తమ భూముల్ని వేరే వాళ్లకు రిజిస్ట్రిర్ చేశారంటూ ఆరోపించారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు.

Updated Date - 2020-08-04T01:21:13+05:30 IST