‘రైతు ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేయాలి’

ABN , First Publish Date - 2020-02-20T08:01:01+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌)ను బలోపేతం చేయాలని మా ర్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న ఆదేశించారు. చుట్టుగుంట సెంటర్‌లోని

‘రైతు ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేయాలి’

గుంటూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌)ను బలోపేతం చేయాలని మా ర్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న ఆదేశించారు. చుట్టుగుంట సెంటర్‌లోని ఆ శాఖ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఎఫ్‌పీవోలను బలోపతం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్‌ యార్డుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చడంపై జైపూర్‌కు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ (ఎన్‌ఐ ఏఎం)తో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఏఎం డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, మార్కెటింగ్‌శాఖ కమిషనర్లు ప్రద్యుమ్న ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సాంకేతిక అంశాలను మార్కెటింగ్‌ వ్యవస్థలో ప్రవేశపెట్టినట్లు ప్రద్యుమ్న తెలిపారు. మార్కెటింగ్‌ శాఖ జేడీ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T08:01:01+05:30 IST