రైతు వేదికలు నిర్మిస్తే మేలు

ABN , First Publish Date - 2020-05-19T09:26:03+05:30 IST

రైతు వేదికలతో ఎంతో మేలు జరుగుతుందని, 4, 5 నెలల కాలంలో నిర్మాణాలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌

రైతు వేదికలు నిర్మిస్తే మేలు

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, మే 18 : రైతు వేదికలతో ఎంతో మేలు జరుగుతుందని, 4, 5 నెలల కాలంలో నిర్మాణాలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌, అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ సోమవారం కలెక్టర్లు, వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా సీఎం మాట్లాడుతూ.. గ్రామాల్లో రైతు వేదికలు లేని కారణంగా రైతులు ఎక్కడ మాట్లాడుకోవాలో తెలియకుండా పోయిందని అన్నారు. సీజన్‌లో ఏఏ పంటలు వేసుకోవాలో... ఎరువులు ఏలా వేసుకోవాలో చర్చించుకునేందుకు ఒక వేదిక అవసరమన్నారు.


ఇందుకు వేదికలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నీటి సౌలభ్యం ఉన్నచోట పత్తిపంటకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మహబూబాబాద్‌, డోర్నకల్‌ ప్రాంతాల్లో మిర్చి పంట ప్రధానమైందని, రైతులు మిర్చిని సాగు చేసుకోవచ్చని కేసీఆర్‌ ప్రత్యేకంగా చెప్పారు. వ్యవసాయ అనుబంధ యంత్ర పరికరాలు, బోర్లు వేసే యంత్రాలు జిల్లాల వ్యాప్తంగా ఎంత ఉన్నాయో నివేదించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, జిల్లా అధికారులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-19T09:26:03+05:30 IST