నిలువునా దగా..!

ABN , First Publish Date - 2022-05-19T05:53:15+05:30 IST

జిల్లాలో అన్నదాతను నిలువునా మోసం చేస్తున్నారు. కొందరు అధి కారులు, మిల్లర్లు కలిసి రైతు కష్టానికి పంగనామాలు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే ధాన్యాన్ని నమోదు చేయకుండా తెరవెనుక కావాల్సిన మిల్లర్లకు సరుకు విక్రయించేలా చేస్తున్నారు. తద్వారా వ్యా పారి చెప్పిన తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్మి నష్టపోయేలా చేస్తున్నా రు.

నిలువునా దగా..!

  • జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు.. అధికారుల మాయాజాలం
  • నేరుగా మిల్లర్లకే తక్కువ ధరకు అమ్మి నష్టపోయేలా చేస్తున్న వైనం
  • ఆర్‌బీకేలో ధాన్యం నమోదు చేయకుండా వ్యాపారులకు తెరవెనుక అప్పగింత
  • అనేక మిల్లుల్లో అనధికార ధాన్యం నిల్వలు: అయినా కన్నెత్తిచూడని అధికారులు
  • ఓ కీలక నేత తండ్రి,సోదరుడు జిల్లాలో మిల్లర్లపై పెత్తనంతో అధికారుల్లో వణుకు
  • ఎంపీ బోస్‌ వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారిన ధాన్యం కొనుగోలు అవకతవకలు 

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అన్నదాతను నిలువునా మోసం చేస్తున్నారు. కొందరు అధి కారులు, మిల్లర్లు కలిసి రైతు కష్టానికి పంగనామాలు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే ధాన్యాన్ని నమోదు చేయకుండా తెరవెనుక కావాల్సిన మిల్లర్లకు సరుకు విక్రయించేలా చేస్తున్నారు. తద్వారా వ్యా పారి చెప్పిన తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్మి నష్టపోయేలా చేస్తున్నా రు. ప్రస్తుత రబీ ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరుగుతోందని, కొం దరు అధికారులు, మిల్లర్లు కలిసి రైతులను మోసం చేస్తున్నారని ఎంపీ బోస్‌ బుధవారం ఆరోపించిన నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వె నుక మతలబులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలో కొ న్ని మిల్లుల్లో లెక్కల్లో చూపని అనధికార నిల్వలు భారీగా ఉన్నాయి. రైతులనుంచి నేరుగా తక్కువకు కొనుగోలు చేసి ఆనక అధికారుల సా యంతో ప్రభుత్వానికి వీటిని అంటగడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచీ ధాన్యం డంప్‌ చేసి ఇక్కడ పౌరసరఫరాల సంస్థకు అసలు బియ్యానికి బదులు ఒడిషావి అంటగడుతున్నారు. ఇన్ని తెలిసినా అధికారులు ఆ మిల్లులపై దాడిచేయడానికి భయపడుతున్నారు. తెరవెనుక ఓ కీలకనేత తండ్రి, సోదరుడు వీటికి నాయకత్వం వహిస్తుండడమే కారణం. 

ఎంత మోసమో..

జిల్లాలో ధాన్యం కొనుగోలు వెనుక ఏటా భారీ మతలబులు జరుగుతున్నాయి. అన్నదాతలు పండించే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనేది కొంతైతే తెరవెనుక రకరకాల ఎత్తుగడలతో కొందరు మిల్లర్లు నేరుగా కల్లాల వద్దకు వెళ్లి ధాన్యం కొంటున్నారు. ప్రభుత్వానికి ఇస్తే ధాన్యం డబ్బులు నెలల తరబడి రావని, తమకు ఇస్తే వెంటనే డబ్బు ఇస్తామంటూ అనధికారికంగా వేల టన్నుల ధాన్యం కొంటున్నారు. దీనివల్ల ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర కంటే తక్కువ డబ్బు ముట్టి అన్నదాత నష్టపోతున్నాడు. ఆనక ఈ ధాన్యాన్ని అదే రైతు లేదా చిరునామా మార్చి సదరు రైస్‌మిల్లరు ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వంనుంచి రైతు ఖాతాలో పడే కోట్ల డబ్బును ముందస్తు ఒప్పదం ప్రకారం వారి నుంచి వసూలు చేస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఏటా ఖరీఫ్‌, రబీలో ఇదే మోసం తంతు. తాజాగా జిల్లాలో రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. ఐదు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి ఇంతవరకు 8,269మంది రైతుల నుంచి 90వేల మెట్రిక్‌ టన్నులే సేకరించారు. ప్రభుత్వానికి ధాన్యం ఇస్తే డబ్బులు నెలల తరబడి రావనే కారణంతో అనేకమంది అన్నదాతలు పలువురు మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా రూ.1455 మద్దతు ధరకుగాను బస్తాకు రూ.1250 నుంచి రూ.1300 వరకు తక్కువకు కొంటున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని, కొను గోలు కేంద్రం వద్దకు వెళ్తే వెంటనే తీసుకో రని, దీంతో తడిచి పోతాయని బెదరగొట్టి ఎక్కడికక్కడ మిల్లర్లు ధాన్యం కొంటున్నా రు. దీంతో వేలమంది రైతులు నష్టపోతు న్నారు. ఆనక ఈ ధాన్యాన్ని వ్యాపారులు మిల్లులకు తరలిస్తున్నారు. ఆ తర్వాత అధి కారులతో బేరం కుదుర్చుకుని మిల్లులో ఉన్న ధాన్యం కొందరు రైతులనుంచి సేక రించినట్లు బినామీ పేర్లతో ఆర్‌బీకేల్లో రికా ర్డులు సృష్టిస్తున్నారు. మరోపక్క కొందరు రైతులు ఆర్‌బీకేల వద్దకు ధాన్యం అమ్మడా నికి వస్తే కావాల్సిన మిల్లర్లకు అక్కడి అధి కారులు రైతుల వివరాలు ఇస్తున్నారు. దీం తో అనధికార కొనుగోళ్లు జరుగుతున్నా యి. ఇవేవీ రికార్డుల్లో నమోదవడం లేదు. ఇదం తా ఒకెత్తయితే జిల్లాలో రబీలో ఎక్కువగా 1121 రకం వరి పండుతోంది. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లర్లకు బ్యాం కు గ్యారెంటీ(బీజీ) ఆధారంగా కేటాయిస్తుంది. తిరిగి ఈ ధాన్యాన్ని మర ఆడించి పౌరసరఫరాల సంస్థకు బియ్యం ఇవ్వాలి. కానీ కొందరు మిల్లర్లు ఒడిషానుంచి అతితక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఇక్కడ మిల్లు ల్లో మర ఆడించి జిల్లాలో పండిన పంటకు బదులు వాటినే ప్రభుత్వాని కి అంటగడుతున్నారు. ఈ విషయంలో పౌరసరఫరాల సంస్థ గోదాము ల్లో అనేక చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి. ఆనక ఇక్కడ బియ్యాన్ని పాలిష్‌ చేసి ప్యాకింగ్‌ల్లో అధికధరలకు రాష్ట్రంలో అనేక నగరాలు, విదే శాలకు తరలించి కొందరు మిల్లర్లు, అధికార పార్టీ నేతలు ఆర్జిస్తున్నారు.

తనిఖీల ఊసే లేదు..

ఖరీఫ్‌, రబీ ధాన్యం కొనుగోలు సమయంలో జేసీ రైస్‌ మిల్లుల తనిఖీ లు చేపట్టాలి. అక్కడ ధాన్యం నిల్వలు పరిశీలించాలి. ఆర్‌బీకేల ద్వారా సీఎంఆర్‌ కోసం ఇచ్చిన ధాన్యం ఎంత? మిల్లులో ఎంత ఉంది? వంటివి తనిఖీ చేయాలి. అదనపు ధాన్యం నిల్వలు సీజ్‌ చేయాలి. కానీ జిల్లాలో ఇదేదీ జరగడం లేదు. ఇతర జిల్లాల్లో ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్‌ల్లో జేసీలు మిల్లుల తనిఖీలకు వెళ్తున్నారు. కానీ జిల్లాలో మాత్రం హడల్‌. జిల్లా విభజనకు ముందు, ఆ తర్వాత ఇంతవరకు ఆ ఊసే లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోల్చితే ఇక్కడ మిల్లర్ల పరిస్థితి పూర్తి భిన్నం. అధికార పార్టీకి చెందిన ఓ కీలక తండ్రి, సోదరుడు మిల్లులపై మొత్తం పెత్తనం ఎన్నో ఏళ్లనుంచి కొనసాగిస్తున్నారు. దీంతో ఏ మిల్లుపైనా జేసీ, పౌరసరఫరాల సంస్థ అధికారులెవరూ కన్నెత్తి చూడడానికి వీల్లేదు. ఈ కారణంతోనే పలు మిల్లుల్లో ఎన్నో అక్రమాలున్నా తెలిసి కూడా అధికా రులు జోలికివెళ్లడం లేదు. దీంతో రైతులను దోపిడీ చేయడం కొందరు మి ల్లర్లకు సులువవుతోంది. బుధవారం రాజమహేంద్ర వరంలో ఎంపీ బోస్‌ చేసిన వ్యాఖ్యలు ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను మరోసారి చర్చనీయాంశం చేసింది. సదరు కీలక నేత కుటుంబాన్ని లక్ష్యంగా చేసు కుని బోస్‌ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. గతేడాది కాకినాడ లో జడ్పీ సమావేశంలోను సదరు కీలకనేతను ఉద్దేశించి బోస్‌ ధ్వజమె త్తారు. మేడలైన్‌ నిర్మాణంలోను, టిడ్కో ఇళ్లలోను అవినీతి జరుగుతోం దని బయటపెట్టి సంచలనం సృష్టించారు.

Updated Date - 2022-05-19T05:53:15+05:30 IST