Abn logo
Apr 12 2021 @ 23:08PM

విద్యుదాఘాతానికి రైతు మృతి

పాన్‌గల్‌, ఏప్రిల్‌ 12: విద్యుదాఘాతానికి రైతు మృతి చెం దాడు. ఈ ఘటన పాన్‌గల్‌ మండలం కదిరెపాడు తండాలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై విజయభాస్కర్‌ తెలిపి న వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చంద్రునాయక్‌ (48) తన పొలానికి నీరు పారించేందుకు వెళ్లి బోరు మో టారును వేశాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై తెలిపారు. 

కేఎల్‌ఐ కాలువలో పడి రైతు మృతి

పాన్‌గల్‌: ప్రమాదవశాత్తు కేఎల్‌ఐ కాల్వలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన  మండల పరిధి లోని కదిరేపాడులో చోటు చేసుకుంది. సోమవారం ఎస్సై విజయభాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె మధు (28) తన పంట పొలానికి సాగునీరు పారించేందుకు  కేఎల్‌ఐ కాల్వలోకి దిగాడు.  కాల్వలో భారీ గా పేరుకుపోయిన జమ్ములో చిక్కుకొని మృతి చెందాడు.  మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement