Abn logo
Jul 25 2021 @ 22:39PM

విద్యుదాఘాతంతో రైతు మృతి

మృతి చెందిన జూపల్లి బాబురావు

వనపర్తి క్రైమ్‌, జూలై 25: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన రేవల్లి మం డలంలోని గొల్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు గ్రా మానికి చెందిన జూపల్లి బాబురావు(50) ఆదివారం ఉదయం పొలం దగ్గర మోటర్‌ ఆన్‌ చేయ డానికి వెళ్లగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు వారు తెలిపారు.