అనంతపురం: జిల్లాలో విషాదం ఘటన చోటు చేసుకుంది. తాడిమర్రి మండలం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామం మరిమాకులపల్లిలో రైతు శ్రీనివాసరెడ్డి (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిహారం అందక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో మృతిడి కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి. మృతిడి కుటుంబికులు కన్నీరుమున్నీరవుతున్నారు.