జగ్గయ్యపేట: వ్యవసాయం కోసం చేస్తున్న అప్పులు రైతులను బలితీసుకుంటున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న అన్నదాతలు మనోధైర్యాన్ని కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జగ్గయ్యపేట మండలంలోని షేర్మహమ్మద్పేట గ్రామంలో అప్పుల బాధకు తట్టుకోలేక కౌలురైతు యలమందల సత్యం (65) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసంఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.