అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-30T10:26:00+05:30 IST

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండల కేంద్రం మధిర గ్రామం నబీనగర్‌లో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

జగదేవ్‌పూర్‌, నవంబరు 29: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండల కేంద్రం మధిర గ్రామం నబీనగర్‌లో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జహంగీర్‌ (45) కు రెండెకరాల సాగుభూమి ఉంది. మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడు. పదేళ్ల క్రితం కూతురు అనారోగ్యం బారినపడడంతో రూ.రెండు లక్షల వరకు ఖర్చు చేసినా ఆమె బతకలేదు. కొడుకుకు రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో అతడి చికిత్స కోసం రూ.వేలు ఖర్చయ్యాయి.నాలుగైదు సంవత్సరాలుగా పంటలు సరిగా పండక కుటుంబ పోషణ భారమైంది. ఈసారి రూ.లక్ష పెట్టుబడితో రెండెకరాల్లో పత్తి సాగు చేశాడు. వర్షాల వల్ల దెబ్బతింది. నెల క్రితం కులం చిట్టీ ఉండగా గత చిట్టీల కమీషన్‌తో కలిపి రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉండడంతో తెలిసిన వారందరినీ అప్పు అడిగాడు. వారెవరూ ఇవ్వకపోవడంతో తన భార్య తాళిబొట్టును తాకట్టు పెట్టి చిట్టీ డబ్బు చెల్లించాడు. అప్పుల బాధలు తీరలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన జహంగీర్‌.. మూడు రోజుల క్రితం పురుగులమందు తాగాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

Updated Date - 2020-11-30T10:26:00+05:30 IST