వ్యవసాయ పనుల్లో కృష్ణమూర్తి
1998 డీఎస్సీలో 53 ఏళ్లకు ఉద్యోగం
మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన కృష్ణమూర్తి వయస్సు 53 ఏళ్లు. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. 1998 డీఎస్సీలో భాగంగా ఈ వయసులో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఆయన 2008 దాకా డీఎస్సీ రాస్తూనే వచ్చారు. 1998 డీఎస్పీలో ఉద్యోగం వచ్చి ఈ రైతు ఇప్పుడు ఉపాధ్యాయుడయ్యాడు. అయితే తనను కష్టకాలంలో ఆదుకొన్న వ్యవసాయాన్ని వీడనని, ఉపాధ్యాయ వృత్తి చేస్తూనే వ్యవసాయం కొనసాగిస్తానని ఆయన అన్నారు.
-మహానంది