అన్నదాత బిజీబిజీ

ABN , First Publish Date - 2022-06-28T05:36:39+05:30 IST

అన్నదాతలు బిజీ అయ్యారు. వ్యవసాయ పనులకు ఉపక్రమించారు. వర్షాలు కురుస్తుండటంతో భూపాలపల్లి జిల్లాలో రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమయ్యారు. ఈసారి పత్తి వైపే అధ్యధికులు ఆసక్తి చూపుతున్నారు. గత ఖరీ్‌ఫతో పోల్చుకుంటే ఈసారి పత్తి విస్తీర్ణం పెరగనుంది. అలాగే ఈ వానాకాలంలో 2,55,608 ఎకరాల్లో వివిఽధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు.

అన్నదాత బిజీబిజీ
భూపాలపల్లి మండలం గొల్లబుద్దారంలో దుక్కులు దున్నుతున్న రైతులు

వానాకాలం సాగుకు సిద్ధమైన రైతన్నలు
దుక్కులు దున్ని.. విత్తనాలు వేసే పనిలో నిమగ్నం
ఈ ఏడాది పెరగనున్న ‘పత్తి’ విస్తీర్ణం
2,55,608 ఎకరాల్లో వివిఽధ పంటలు సాగువుతాయని అంచ నా
అందుబాటులో లేని యూరియా


అన్నదాతలు బిజీ అయ్యారు. వ్యవసాయ పనులకు ఉపక్రమించారు. వర్షాలు కురుస్తుండటంతో భూపాలపల్లి జిల్లాలో రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమయ్యారు.  ఈసారి పత్తి వైపే అధ్యధికులు ఆసక్తి చూపుతున్నారు. గత ఖరీ్‌ఫతో పోల్చుకుంటే ఈసారి పత్తి విస్తీర్ణం పెరగనుంది. అలాగే ఈ వానాకాలంలో 2,55,608 ఎకరాల్లో వివిఽధ పంటలు సాగవుతాయని  అధికారులు అంచనా వేశారు.

కృష్ణకాలనీ, జూన్‌ 27: భూపాలపల్లి జిల్లా రైతులు సాగుబాట పట్టారు. అడపాదడపా కురుస్తున్న సాధారణ వర్షాల నేపథ్యంలో వివిధ పంటలు వేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. పలువురు రైతులు ఇప్పటికే దక్కులు సిద్ధం చేసుకొని పత్తి సాళ్ల అచ్చులు కొట్టి పెట్టుకున్నారు. కొన్నిచోట్ల రైతులు పత్తి విత్తనాలు విత్తడం కూడా మొదలు పెట్టారు. అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు,  కాడెద్దులతో దుక్కులు దున్నుతున్నారు. చాలా మంది రైతులు సాంకేతికతనే సద్వినియోగం చేసుకుంటున్నారు. యంత్రాలతోనే అత్యధికంగా వ్యవసాయ పనులు చేపడుతున్నారు.

పత్తికే ప్రాధాన్యం..
భూపాలపల్లి జిల్లాలో రైతులు పత్తి సాగుకే అత్యధిక రైతులు ప్రాధాన్యమిస్తున్నట్టు తెలుస్తోంది. వరి సాగు తర్వాత ఆరుతడి పంట అయిన పత్తి వైపే మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండటం, వర్షాభావ పరిస్థితులు, కనీస దిగుబడి, మార్కెట్‌ భద్రతా ఇతరత్రా అంశాలన్నింటినీ బేరీజు వేసుకుంటూ ‘తెల్ల బంగారాన్ని’ పండించేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. పత్తి సాగు చేసేందుకు  ఎకరాకు రూ. 20 వేల వరకు పెట్టుబడి అవుతుంది. నల్లరేగడి భూముల్లో ఎకరాకు కనీసం 12 నుంచి 17 క్వింటాళ్లు, సాధారణ భూముల్లో 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రానుంది. ప్రస్తుతం మార్కెట్‌లో పత్తికి మంచి డిమాండ్‌ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్దతు ధర భారీగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 2021 వానాకాలంలో పత్తి 9,646 ఎకరాల్లో సాగు విస్తీర్ణం అంచనా ఉండగా ఈ ఖరీ్‌ఫలో 1,18,600 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. గత వానాకాలంతో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగు అదనంగా 28,955 ఎకరాల విస్తీర్ణం పెరగనుంది.  

యూరియా సరఫరా అంతంతే..

జిల్లాలో పంటల సాగుకు సరిపడా యూరియా అందుబాటులో లేదని తెలుస్తోంది. ఈ వానాకాలం  మొత్తంగా 31,340 టన్నులు అవసరముండగా ఇప్పటి వరకు 4,856 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఏప్రిల్‌, మే నెలల్లోనే జిల్లాకు రావాల్సిన ఎరువులు లక్ష్యం మేరకు చేరలేదు. యూరియాతో పాటు డీఏపీ, ఎంవోపీ (పోటాష్‌), కాంప్లెక్స్‌, సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ ఎరువులను ప్రభుత్వం సీజన్‌కు ముందుగానే సిద్ధంగా ఉంచాల్సి ఉండగా వీటిని అవసరమైన మేరకు నిల్వ చేయలేదు. స్వల్ప స్థాయిలో నిల్వ ఉంచడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. త్వరలోనే యూరియా వస్తుందని అధికారులు చెబుతున్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 12,780 టన్నుల డీఏపీ, 13,760 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 4840 టన్నుల పోటాష్‌ అవసరం ఉంటాయని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇదిలా ఉండగా అన్ని మండలాల్లో 50 వేల ఎకరాలకు సరిపడా జీలుగు విత్తనాలు 3,850 క్వింటాళ్ల సరఫరా చేశారు. మొగుళ్లపల్లి మండలంలో జనుము వెయ్యి ఎకరాలను లక్ష్యంగా చేసుకొని వంద క్వింటాళ్లను ఇక్కడ అందించారు. అవసరమున్న వారికి సరఫరా చేయను న్నారు. వరి 72,500 ఎకరాల్లో నేరుగా  నాట్లు వేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2,250 ఎకరాల్లో నేరుగా వరి వెదజల్లే పద్ధతికి శ్రీకారం చుట్టారు.

యథేచ్ఛగా దోపిడీ
రైతులు నుంచి ప్రతి ఏటా ఓ వైపు వ్యాపారులు.. మరో వైపు దళారులు అందినకాడికి దండుకుంటూనే ఉన్నారు. విత్తన షాపుల్లో పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఫర్టిలైజర్‌ షాపుల్లో వ్యాపారులు ఎమ్మార్పీకి మించి ధరలను తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే బిల్లు  తప్పని సరిగా ఇవ్వా ల్సి ఉన్నా ఎక్కడా కూడా అది అమలు కావడం లేదు. ఇక పల్లెల్లో అనుమతులు లేని  ఫర్టిలైజర్‌ షాపులను కొందరు ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులను విక్రయిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఈ దందా సాగతుండగా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్ర స్థాయిలో రైతులకు పంటల సాగుపై గానీ, విత్తనాల, ఎరువుల ఎం పిక విషయంలో గానీ వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించిన దాఖలాలు కూడా అంతగా కనిపించడం లేదు. క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది పర్యటించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఉద్దెర సాకుతో దళారులు ఇచ్చే విత్తనాలను, ఎరువులనే రైతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.



Updated Date - 2022-06-28T05:36:39+05:30 IST