Abn logo
Jul 24 2021 @ 01:19AM

ప్రజాప్రతినిధులకు వెలకట్టవద్దు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును సన్మానిస్తున్న నాయకులు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

యాదాద్రి రూరల్‌, జూలై 23: హుజూరాబాద్‌లో ప్రజాప్రతినిధులకు టీఆర్‌ఎస్‌ వెలకట్టాలని చూస్తోందని, ఇది సరికాదని సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం సొంత పని నిమిత్తం యాదగిరిగుట్టకు వచ్చిన ఆయనను స్థానిక నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ త్వరలో జరగబోయే హుజూరాబాద్‌ ఉపఎన్నికలో గెలవాలన్న కాంక్షతో ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, చైర్మన్లు, జడ్పీటీసీలను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవాలని చూస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సజావుగా జరి గేలా సీఎం కేసీఆర్‌ చొరవ చూపాలన్నారు. ఆయనవెంట స్థానిక నాయకులు ఉన్నారు.