హోమ్ ఐసోలేష‌న్‌లోనూ విద్యాభ్యాసం!

ABN , First Publish Date - 2020-05-19T14:49:37+05:30 IST

హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్ జిల్లాలో కరోనాను ఓడించి, 75 మందికి పైగా కోలుకున్నారు. వీరిలో గ్రీన్‌ఫీల్డ్ కాలనీలో నివసిస్తున్న కిషోర్‌(14) కూడా ఉన్నాడు. అతను హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న మొదటి రోగి.

హోమ్ ఐసోలేష‌న్‌లోనూ విద్యాభ్యాసం!

ఫరీదాబాద్: హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్ జిల్లాలో కరోనాను ఓడించి, 75 మందికి పైగా కోలుకున్నారు. వీరిలో గ్రీన్‌ఫీల్డ్ కాలనీలో నివసిస్తున్న కిషోర్‌(14) కూడా ఉన్నాడు. అతను హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న మొదటి రోగి. ఆ బాలుడు కోలుకున్నట్లు ఇటీవల ఆరోగ్య శాఖ ధృవీకరించింది. కిషోర్ తన తాత, అమ్మమ్మలతో కలిసి గ్రీన్ ఫీల్డ్ కాలనీలో ఉంటున్నాడు. తల్లిదండ్రులు ప్రస్తుతం విదేశాలలో ఉంటున్నారు. ఏప్రిల్‌లో ఢిల్లీలోని త‌మ‌ బంధువుల‌ వద్దకు వెళ్లామ‌ని అత‌ని తాత చెప్పారు. అక్కడి నుండి వచ్చిన తరువాత ఇంట్లోని అంద‌రి నమూనాలను తీసుకున్నార‌ని, వీరిలో కిషోర్ క‌రోనా పాజిటివ్‌గా తేలాడ‌న్నారు. దీంతో కిషోర్‌ను ఇంట్లోని ఒక ప్రత్యేక గదిలో ఉంచారు. ఆ గదిలో టీవీ, కంప్యూటర్, మొబైల్‌ఫోను ఏర్పాటు చేశారు. అతను చ‌దువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో కిషోర్‌కు తరగతులు నిర్వహిస్తున్నారు. క్రమం తప్పకుండా తరగతులు వింటున్నాడు. ఇది కిషోర్ ఒత్తిడిని మాయం చేస్తోంద‌ని అత‌ని తాత తెలిపారు. 

Updated Date - 2020-05-19T14:49:37+05:30 IST