గన్నవరం విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులతో మాజీ సీఎం
ఇబ్రహీంపట్నం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ నాయకులు గురువారం గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. గోదావరి జిల్లాలో వివాహ వేడుకకు హాజరై హైదరాబాద్ వెళుతుండగా కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. రాజీవ్ రతన్, కనకదుర్గ దేవస్థానం మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, పీసీసీ కార్యదర్శి పోతురాజు ఏసుదాస్, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, జగ్గయ్యపేట పార్టీ ఇన్‌చార్జి కర్నాటి అప్పారావు పాల్గొన్నారు.