ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-07-24T06:52:19+05:30 IST

ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో అలంకార్‌ కూడలిలోని ధర్నా చౌక్‌లో పీఆర్‌సీ అమలు చేయాలని, పెండింగ్‌లోని ఆరు డీఏలను మంజూరు చేయాలని, సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా జరిగింది.

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

అర్బన్‌ తహసీల్దార్‌కు వినతిపత్రం

పాయకాపురం, జూలై 23 : ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో అలంకార్‌ కూడలిలోని ధర్నా చౌక్‌లో పీఆర్‌సీ అమలు చేయాలని, పెండింగ్‌లోని ఆరు డీఏలను మంజూరు చేయాలని, సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు సీఎం జగన్‌ మాట ఇచ్చి ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తరువాత తప్పారన్నారు. 11వ పీఆర్‌సీ సిఫార్సులు 2018 జూలై 1 నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజుల్లో సీపీఎ్‌సను రద్దు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారని వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. డీటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.కృష్ణయ్య మాట్లాడుతూ పెండింగ్‌లోని ఆరు డీఏలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సుందరయ్య మాట్లాడుతూ 3, 4, 5 తరగతుల విలీనాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అర్బన్‌ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌పి.మనోహర్‌ కుమార్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నేతలు కొమ్ము ప్రసాద్‌, పూర్ణచంద్రరావు, మండవ వెంకట్‌ శ్రీనివాస్‌, ఇంతిరాజు, బీటీఏ నేతలు, యూటీఎఫ్‌ నేతలు పి.లీల, కె.భగీరధ, కొండలరావు, అనంత, పాలకొల్లు శ్రీనివాస్‌, కె.శ్రీనివాసరావు, గోపాలకృష్ణ, ఏపీఎన్‌జీవో నేతలు ఇక్బాల్‌, స్వామి, రత్నకుమార్‌, దేవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T06:52:19+05:30 IST