ఎంటీఏఆర్‌ టెక్‌ ఐపీఓకి అద్భుత స్పందన

ABN , First Publish Date - 2021-03-06T06:33:44+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన ఎంటీఏఆర్‌ టెక్‌ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి కనివిని ఎరుగని స్పందన లభించింది. శుక్రవారంనాడు చివరి రోజున బిడ్డింగ్‌ ముగిసే సమయానికి ఈ ఇష్యూ 200 రెట్లు అధికంగా సబ్‌స్ర్కిప్షన్‌ సాధించింది. కంపెనీ 72.6 లక్షల ఈక్విటీ

ఎంటీఏఆర్‌ టెక్‌ ఐపీఓకి అద్భుత స్పందన

ముంబై: హైదరాబాద్‌కు చెందిన ఎంటీఏఆర్‌ టెక్‌ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి కనివిని ఎరుగని స్పందన లభించింది. శుక్రవారంనాడు చివరి రోజున బిడ్డింగ్‌ ముగిసే సమయానికి ఈ ఇష్యూ 200 రెట్లు అధికంగా సబ్‌స్ర్కిప్షన్‌ సాధించింది. కంపెనీ 72.6 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి పెట్టగా 145.79 కోట్ల ఈక్విటీలకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం 28.4 శాతం, సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం 165 రెట్లు అధిక సబ్‌స్ర్కిప్షన్‌ సాధించాయి. ఈ కంపెనీ గత మంగళవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.179 కోట్లు సమీకరించింది. షేరు ధర శ్రేణి రూ.574-575గా ప్రకటించారు.

 

లాభాల స్వీకరణ దెబ్బ: అమెరికా బాండ్‌ మార్కెట్లో కల్లోలం, రిటైల్‌ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ లక్ష్యంతో భారీగా అమ్మకాలు సాగించడం ఈక్విటీ మార్కెట్‌ను వరుసగా రెండో రోజున కూడా కుంగదీసింది. సెన్సెక్స్‌ 440.76 పాయింట్ల నష్టంతో 50405.32 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 726 పాయింట్ల మేరకు ఎగుడుదిగుడులు చవిచూసింది. నిఫ్టీ 142.65 పాయింట్ల నష్టంతో 14938.10 వద్ద మానసిక అవధి 15000 కన్నా దిగువన ముగిసింది. గత రెండు సెషన్లలో సెన్సెక్స్‌ 1039 పాయింట్లు, నిఫ్టీ 307 పాయింట్లు నష్టపోయాయి. వారం మొత్తం మీద మాత్రం లాభాల్లో ముగిశాయి.


నష్టాల్లో లారస్‌ లాబ్‌: లారస్‌ లాబ్‌ ప్రమోటర్లు రూ.257.71 కోట్ల విలువ గల ఈక్విటీలను విక్రయించడంతో శుక్రవారం ఆ షేరు నాలుగు శాతానికి పైగా నష్టపోయింది. బీఎ్‌సఈలో ఈ షేరు 4.63 శాతం నష్టపోయి రూ.351.3 వద్ద ముగియగా ఎన్‌ఎ్‌సఈలో 4.64 శాతం నష్టపోయి రూ.351.65 వద్ద ముగిసింది. 

Updated Date - 2021-03-06T06:33:44+05:30 IST