సోషల్ మీడియాలో కొన్ని సార్లు సినీ ఫ్యాన్స్, వాళ్లకి ఇష్టమైన హీరోల సినిమాల గురించి వాళ్ళకి నచ్చిన థియరీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సినిమా ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అని ఎవరికి తోచింది వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు సేమ్ ఇలాంటి ఫ్యాన్ థియరినే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ఎన్టీఆర్ (NTR) కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ 31 (NTR31) ఫస్ట్ లుక్ బయటకి వచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్, ఈ పోస్టర్‌లోని ఎన్టీఆర్ అనే పేరులో మొదటి అక్షరం ‘n’ kgf టైటిల్ ఫాంట్ స్టైల్లో ఉందని... ‘t r’ అనే అక్షరాలు ‘సలార్’ (Salaar) ఫాంట్లో ఉన్నాయని అంటున్నారు. kgf, సలార్ చిత్రాల స్టైల్ ఎన్టీఆర్ 31కి ఉండడంతో... ఈ మూవీకి ముందు రెండు సినిమాలకి పక్కా లింక్ ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఇంకో ఫ్యాన్ థియరీ ప్రకారం... ఎన్టీఆర్ 31లో తారక్ (Tarak).. ‘సలార్’ చిత్రంలో రాజమన్నార్‌గా నటిస్తున్న జగపతిబాబు (Jagapathi Babu) కొడుకు అయి ఉంటాడని.. ‘షెర్లాక్ సంపత్ మోడ్’ (Sherlock Sampath Mode)లో మాట్లాడుతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్‌లో రాఖీ భాయ్ అండ్ తారక్ కలిసి సలార్ పైన ఫైట్ చేస్తారు అంటున్నారు. ఇది ఎంత వరకూ నిజమో తెలియాలి అంటే ప్రశాంత్ నీల్ యూనివర్స్ (Prashanth Neel Universe) బయటకి వచ్చే వరకూ ఆగాల్సిందే. అప్పటి వరకూ ఈ ఫ్యాన్ థియరీస్ని చూసి ఎంజాయ్ చేయడమే. అయినా యష్ (Yash), తారక్, ప్రభాస్ (Prabhas) లని ఒక సినిమాలో పెట్టి బ్యాలెన్స్ చేయడం గానీ.. చేసే దమ్ము, డబ్బు, ధైర్యం ఎవరకీ లేదు. ఆ కాంబో చూడాలంటే నిజంగా ఏదైనా మ్యాజిక్ జరగాలి.