Abn logo
Jul 8 2020 @ 11:15AM

దిల్ బేచారా ట్రైల‌ర్‌కు 30 వేల డిస్‌లైక్‌లు... ఇది వారిప‌నే అంటున్న ఫ్యాన్స్‌!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం దిల్ బేచారా ట్రైలర్ ఇటీవలే విడుదలై, అత్య‌ధిక వ్యూవ‌ర్‌షిప్‌తో రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది. అయితే కొంత‌మంది ఈ ట్రైల‌ర్‌ను డిస్‌లైక్ చేస్తున్నారు. దీనిపై సుశాంత్ అభిమానులు స్పందించారు. దీని వెనుక హీరోలు అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్ ఉన్నార‌ని ఆరోపిస్తున్నారు. ఈ ట్రైల‌ర్‌ను 75 లక్షల మంది లైక్ చేయ‌గా, 30 వేల మంది డిస్‌లైక్ చేశారు. ఇలా డిస్‌లైక్ చేస్తున్న‌వారిపై సుశాంత్ అభిమానులు మండిప‌డుతున్నారు. అక్ష‌య్ కుమార్‌, స‌ల్మాన్ అభిమానులు ఈ ప‌నిచేస్తున్నార‌ని వారు అంటున్నారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం దిల్ బెచారా ఈ నెల 24 న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలకానుంది. అయితే సుశాంత్ అభిమానులు తన అభిమాన స్టార్ చిత్రాన్ని వెండితెరపై చూడాలనుకున్నారు. ముంబై విశ్వవిద్యాలయానికి చెందిన‌ న్యాయ విద్యార్థి ఆశిష్ రాయ్ ఈ సినిమా ఓటీటీలో విడుదలకు వ్యతిరేకంగా, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ చిత్రాన్ని పెద్ద‌ తెరపై విడుదల చేసేలా చూడాల‌ని కోరారు. 

Advertisement
Advertisement
Advertisement