అగ్నిప్రమాదంలో ఫ్యాన్సీ దుకాణం దగ్ధం

ABN , First Publish Date - 2021-08-04T05:36:09+05:30 IST

విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఫ్యాన్సీ దుకాణం దగ్ధమై రూ.40 లక్షల ఆస్తినష్టం జరిగిన సంఘటన శ్రీకాళహస్తిలో జరిగింది.

అగ్నిప్రమాదంలో ఫ్యాన్సీ దుకాణం దగ్ధం
ప్రమాదంలో దగ్ధమైన వస్తువులు

శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 3: విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఓ ఫ్యాన్సీ దుకాణం దగ్ధమై రూ.40 లక్షల ఆస్తినష్టం జరిగిన సంఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. అగ్నిమాపక శాఖాధికారి ఆదినారాయణరెడ్డి కథనం మేరకు... శ్రీకాళహస్తి పట్టణం దర్గామిట్టకు చెందిన షరీఫ్‌ స్థానిక తేరువీధిలో ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన దుకాణానికి తాళం వేసి భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో దుకాణంలో షార్ట్‌సర్క్యూట్‌ జరిగి మంటలు రేగాయి. దట్టంగా పొగలు కమ్ముకోవడాన్ని స్థానికులు గుర్తించి షరీ్‌ఫకు ఫోన్‌ చేశారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ... ప్రమాదంలో రూ.40లక్షల ఆస్తినష్టం జరిగినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో లీడింగ్‌ ఫైర్‌మెన్‌ నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T05:36:09+05:30 IST