Jun 7 2021 @ 20:55PM

‘రాధేశ్యామ్’ డిజిటల్ హక్కులు వారి సొంతమేనా?

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల కోసం భారీ పోటీ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో ద‌క్కించుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. వారం ప‌ది రోజుల మిన‌హా ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ కూడా పూర్త‌య్యాయి. లాక్‌డౌన్ ఎఫెక్ట్ ఎప్పుడు ముగిసినా షూటింగ్ స్టార్ట్ చేసి పెండింగ్ పార్ట్‌ను పూర్తి చేయాల‌నేది నిర్మాత‌ల ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. జిల్ ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌కుడు. వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద నిర్మాత‌లు. జూలై 30న సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు.