Abn logo
Mar 3 2021 @ 14:02PM

ఫ్యాన్సీ ఆఫర్‌ దక్కించుకున్న 'విరాటపర్వం' డిజిటల్‌ హక్కులు

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం `విరాటపర్వం`. కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా నక్సలైట్ నేపథ్యంలో డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాయిపల్లవి, నందితా దాస్, ప్రియమణి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌, కోలు కోలు అనే సాంగ్ ప్రేకకులను ఆకట్టుకున్నాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేటెస్ట్‌ సమాచారం మేరకు ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ డిజిటల్‌ హక్కులను ప్రముఖ డిజిటల్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ రూ.11 కోట్లకు దక్కించుకుంది. సినిమాపై ఉన్న క్రేజ్‌, కాంబినేషన్స్‌ కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ భారీ మొత్తాన్ని వెచ్చించి విరాటపర్వం హక్కులను దక్కించుకుంది. ఏప్రిల్‌ 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement
Advertisement