పేట చేనేత చీరలకు ఖ్యాతి

ABN , First Publish Date - 2022-08-08T04:40:47+05:30 IST

నారాయణపేట చీరలకు ఖ్యాతి పెరుగుతోందని, ప్రస్తుత మార్కె ట్‌కు అనుగుణంగా చేనేత చీరల ఉత్పత్తి జరగాలని కలెక్టర్‌ హరిచందన అన్నారు.

పేట చేనేత చీరలకు ఖ్యాతి
వ్యాస రచన పోటీల్లో విజేతకు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

- మార్కెట్‌కు అనుగుణంగా ఉత్పత్తి చేయాలి  

- కలెక్టర్‌ హరిచందన 

నారాయణపేట టౌన్‌, ఆగస్టు 7 : నారాయణపేట చీరలకు ఖ్యాతి పెరుగుతోందని, ప్రస్తుత మార్కె ట్‌కు అనుగుణంగా చేనేత చీరల ఉత్పత్తి జరగాలని కలెక్టర్‌ హరిచందన అన్నారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత దినోత్సవం సందర్భంగా సింగారం చౌరస్తాలోని నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రారంభించిన చేనేత బీమా నేతన్నకు ధీమా కార్యక్రమంతో పాటు  జిల్లా పాలన మహిళా అధికారులు చేనేత చీరలకు ప్రాధాన్యం ఇవ్వనున్న ట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.  చీరలకు మార్కెటింగ్‌ కోసం మోడల్స్‌ ద్వారా పరిచయం చేయడం జరిగిం దని, ఇక్కడ తయారు చేసిన చీరలను ఇక్కడి వారి ద్వారానే చీరలపై ఫొటో షూట్‌, డాక్యుమెంటరీ తయారు చేయనున్నట్లు తెలిపారు. దీంతో మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతుందన్నారు. చేనేత శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రెండు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే ధన్వాడలో మరో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. లూమ్స్‌లో కొత్తరకం వాటిని పరిచయం చేయాలన్నారు. చేనేత శాఖలో లూ మ్స్‌లకు రుణాలు ఇవ్వడానికి ఫ్రభుత్వం సిద్ధంగా ఉందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కార్మికులను కోరారు. చేనేత కార్మికుల కోసం అరుణ్యను ప్రారంభించామని కలంకారి, బ్లాక్‌ పెయింటింగ్‌, ఇతర రకాల డిజైన్‌లతో చీరలను తయారు చేయ డంతో పాటు ఎగ్జిబిషన్‌లో పేట చీరలను పరిచయం చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట చేనేతకు, బంగారానికి ప్రాధాన్యత ఉండేదన్నారు. మళ్లీ పేట చేనేత కు ప్రాముఖ్యతను తీసుకురావాలని ఇప్పటి అభిరుచులకు అనుగుణంగా మార్కెట్‌ చేయాలని కలెక్టర్‌ ముందుకెళ్తున్నట్లు తెలిపారు. చీరలే కాకుండా మగవారికి అనువైన చేనేత వస్త్రాలను తయారు చే యాలన్నారు. చేనేత సొసైటీ ఆస్తులు అన్యక్రాంతం కాకుండా కలెక్టర్‌తో కలిసి అవి చేనేత కార్మికులకే దక్కేలా చూశామన్నారు. జిల్లా కేంద్రంలో ఆరు కోట్లతో వీవర్స్‌ వీవింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని త్వరలో నిర్మించి ప్రారంభిస్తామన్నారు. చేనేత కార్మి కుల ద్వారా తయారు చేసిన ఓ వీడియోను వీక్షించి చేనేత వస్త్రాల వినియోగం వాటి ప్రాముఖ్యత అంశంపై నిర్వహించిన వ్యాసచన పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలను అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పద్మజ రాణి, ఆర్డీవో రాంచందర్‌, పుర చైర్‌పర్సన్‌ గందె అనసూయ, పుర వైస్‌చైర్మన్‌ హరినారాణ భట్టడ్‌, చేనేత జౌళిశాఖ అధికారులు చంద్రశేఖర్‌, చేనేత కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-08T04:40:47+05:30 IST