Apr 23 2021 @ 10:41AM

కరోనాతో ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు మృతి..!

కరోనా కారణంగా సామాన్యుల నుంచి సినీ, రాజకీయ నాయకులు.. ప్రాశ్రామిక వేత్తలు మృతి చెందుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి కరోనా అల్లకల్లోలం సృష్ఠిస్తోంది. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవడమే కాదు ఊహించని విధంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ సగా మిగతా చిత్ర పరిశ్రమలలోని ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు శ్రవణ్ రాథోడ్ కరోనా బారిన పడి మృతి చెందారు. 1990లలో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకి సంగీతం అందించి ప్రేక్షకుల్లో.. ఇండస్ట్రీ వర్గాలలో ఎంతో పేరు సంపాదించుకున్నారు. శ్రవణ్ రాథోడ్ - నదీమ్ కలిసి 2005 వరకు ఎన్నో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలకి అద్భుతమైన పాటలు, సంగీతం అందించారు.