Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెరికాలో ప్రముఖ నటుడు మృతి.. కారణం అదేనా..?

ఎన్నారై డెస్క్: ప్రముఖ అమెరికన్ నటుడు మైఖేల్ కె. విలియమ్స్ కన్నుమూశారు. న్యూయార్క్‌లోని తన అపార్ట్‌మెంట్లో ఆయన మృతదేహం లభించింది. అపార్ట్‌మెంట్లో ఎటువంటి గొడవ జరిగిన ఆనవాళ్లు లేవని, అంతా సవ్యంగానే ఉందని పోలీసులు చెప్పినట్లు సమాచారం. ఐదుసార్లు ఎమ్మీ అవార్డు పోటీల్లో నామినీగా నిలిచిన ఈ యాక్టర్ ఇంట్లో పారాఫెర్నాలియా అనే డ్రగ్ దొరికింది. ఈ 54 ఏళ్ల యాక్టర్ అతిగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఓవర్‌డోస్ అయ్యి మరణించినట్లు భావిస్తున్నారు. హెరాయిన్ లేదంటే ఫెంటానిల్ ఎక్కువగా తీసుకోవడం వల్లే అతను మరణించి ఉంటాడని కొందరు భావిస్తున్నారు. ఈ ఫేమస్ నటుడు తన డ్రగ్స్ సమస్యల గురించి బహిరంగంగానే పలుమార్లు చెప్పుకున్నాడు. విలియమ్స్ చనిపోయినట్లు మొదటగా అతని మేనల్లుడు గుర్తించాడు. ప్రముఖ టీవీ సిరీస్ ‘‘ది వైర్’’లో ఒమర్ లిటిల్ పాత్ర ద్వారా బాగా పాపులరైన విలియ్.. ‘‘బ్రాడ్ వాక్ ఎంపైర్’’ చాకీ పాత్ర ద్వారా కూడా పేరు సంపాదించాడు.


తన డ్రగ్స్ సమస్య గురించి ఒకసారి మాట్లాడిన విలియమ్స్.. ‘ది వైర్’లో నటిస్తున్నప్పుడు అతని పాత్ర ఒమర్ లిటిల్ ఒక చిన్న దొంగ. డ్రగ్స్ వ్యాపారుల వద్ద దొంగతనం చేసే వ్యక్తి. ఆ పాత్ర తన నిజజీవితంపై కూడా చాలా ప్రభావం చూపిందని విలియమ్స్ అన్నాడు.

Advertisement

ఓవర్సీస్ సినిమామరిన్ని...

Advertisement