కొడుకును చంపి ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు

ABN , First Publish Date - 2021-12-16T15:48:42+05:30 IST

అప్పుల బాధ ఓ కుటుంబాన్ని బలిగొంది. ఏం కష్టమొచ్చిందో, ఏం కష్టమొచ్చిందో గానీ తమ కుమారుణ్ణి చంపి, ఆనక ఆ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక న్యూవాషర్‌ మెన్‌పేటలో జరిగిన ఈ సంఘ టన ఆ ప్రాంతంలో విషాదం మిగి ల్చింది.

కొడుకును చంపి ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు

                          - అప్పుల బాధకు కుటుంబం బలి


చెన్నై: అప్పుల బాధ ఓ కుటుంబాన్ని బలిగొంది. ఏం కష్టమొచ్చిందో, ఏం కష్టమొచ్చిందో గానీ తమ కుమారుణ్ణి చంపి, ఆనక ఆ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక న్యూవాషర్‌ మెన్‌పేటలో జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో విషాదం మిగిల్చింది. వివరాల్లోకి వెళితే... వెంకటేశన్‌ వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శివాజీ (43), వనితా (33) అనే దంపతులకు వెట్రివేల్‌ (10) అనే కుమారుడున్నాడు. శివాజీ టైలరింగ్‌ చేస్తుండగా, వనితా ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. లాక్‌డౌన్‌ ప్రభావంతో శివాజీ సంపాదన బాగా తగ్గిపోయింది. దీంతో కుటుంబ పోషణకు తెలిసినవారి వద్ద విపరీతంగా అప్పులు చేశాడు. ఇటీవల అప్పులిచ్చినవారంతా తిరిగి చెల్లించాలంటూ శివాజీపై ఒత్తిడి చేశారు. ఈ విషయాన్ని ఆయన భార్య వనితాకు తెలిపాడు. అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో ఇరువురూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అయితే తాము చనిపోతే తమ కుమారుడు ఏమైపోతాడోనన్న బెంగ వారిని కదలనీయలేదు. దాంతో కొద్దిరోజులుగా ముభావంగా వుంటున్న ఆ జంట.. మంగళవారం రాత్రి తమ కుమారుడు వెట్రివేల్‌ను హతమార్చారు. ఆ తర్వాత ఇరువురూ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం శివాజీ ఇంటి నుండి ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు ఇంటి తలుపులు తెరిచి చూశారు. ఓ దిలో వెట్రివేల్‌, వనితా శవాలుగా పడి ఉండగా, శివాజీ శవం ఉరికి వేలాడుతూ కనిపించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆ గదిలో తనిఖీ చేసినప్పుడు శివాజీ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిపెట్టిన లేఖ లభించింది. 

Updated Date - 2021-12-16T15:48:42+05:30 IST