Viral News: 6నెలల చిన్నారిని జైలుకు పంపండి.. అధికారుల చుట్టూ తిరుగుతున్న కుటుంబ సభ్యులు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-10-05T14:16:32+05:30 IST

ఆ చిన్నారికి ప్రస్తుతం 6 నెలల వయసు. ఏ నేరమూ చేయలేదు. కానీ ఆ చిన్నారిని జైలుకు పంపించాలంటూ కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు కాదూ అంటే.. స్థానిక ఎమ్మెల్యే వద్దకూ వెళ్లి మ

Viral News: 6నెలల చిన్నారిని జైలుకు పంపండి.. అధికారుల చుట్టూ తిరుగుతున్న కుటుంబ సభ్యులు.. కారణం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ చిన్నారికి ప్రస్తుతం 6 నెలల వయసు. ఏ నేరమూ చేయలేదు. కానీ ఆ చిన్నారిని జైలుకు పంపించాలంటూ కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు కాదూ అంటే.. స్థానిక ఎమ్మెల్యే వద్దకూ వెళ్లి మరీ అభ్యర్థిస్తున్నారు. అయితే ఆ కుటుంబ సభ్యుల కోరిక నెరవేర్చడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. కాగా.. ఇంతకూ ఆ 6 నెలల చిన్నారిని కుటుంబ సభ్యులు(family members) ఎందుకు జైలుకు పంపాలనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌(Utter Pradesh)లోని చిత్రకూట్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్రకూట్‌లోని రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానికులు రామ్‌లీలాను వీక్షిస్తుండగా.. ఓ యువతి పట్ల ఇద్దరు పోలీసు అధికారులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో అధికారులపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ పోలీసులపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా 7 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పైన ఫొటోలో కనిపిస్తున్న 6 నెలల చిన్నారికి జన్మనిచ్చిన మహిళ కూడా ఉంది.



తల్లి జైలు పాలవడంతో.. 6 నెలల చిన్నారి(6 Months Girl Child)కి పోషణ కరువైంది. తల్లిపాలు తప్ప వేటినీ ఆహారంగా తీసుకుని చిన్నారి.. ఆకలితో ఏడుస్తోంది. ఆ చిన్నారి ఆకలి తీర్చడం.. మిగిలిన కుటుంబ సభ్యుల వల్ల కావడం లేదు. దీంతో ఆ అమ్మాయి నానమ్మ.. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ చిన్నారి బాధను అధికారులకు వివరిస్తోంది. జైలులో ఉన్న తన తల్లి వద్దకు పంపితే.. చిన్నారికి ఆకలి బాధలు ఉండవని చెబుతున్నారు. కానీ అందుకు అధికారులు ఒప్పుకోవడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యేను కూడా సంప్రదించారు. అయితే ఆ ఎమ్మెల్యే కూడా ఏమీ చేయలేకపోయాడు. కాగా.. దీనిపైన స్పందించిన అధికారులు.. ఒక వేళ కోర్టు ఆదేశాలు ఇస్తే.. చిన్నారిని తన తల్లివద్దకు చేరుస్తామని చెబుతున్నారు. 


Updated Date - 2022-10-05T14:16:32+05:30 IST