Abn logo
Jul 28 2021 @ 02:59AM

కుటుంబం పరువు పోయింది: శిల్పాశెట్టి

ముంబై, జూలై 27: అరెస్టైన తర్వాత తొలిసారిగా ఇంటికి వచ్చిన రాజ్‌ కుంద్రాను చూసి శిల్పాశెట్టి ఆగ్రహం వ్యక్తం చేసిందని ముంబై పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సోదాల సమయంలో కుంద్రాను తీసుకుని పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా శిల్ప అతడిపై అరిచినట్లు తెలుస్తోంది. ‘‘మనకు అన్నీ ఉన్నాయి. ఇలా చేయాల్సిన అవసరమేమొచ్చింది. మన కుటుంబ గౌరవం నాశనమైంది. పరిశ్రమలో మన ఒప్పందాలన్నింటినీ రద్దు చేస్తున్నారు’’ అంటూ శిల్ప రోదించినట్లు సమాచారం.