రంగారెడ్డి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆదిబట్ల కుర్మల్‌గూడ చెరువులో దూకి ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గత రాత్రి పురుగుల మందుతాగి చెరువులో దూకినట్లు సమాచారం. చెరువులో తండ్రి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు తేలాయి. మహిళ మృతదేహం కోసం స్థానికులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి