Advertisement
Advertisement
Abn logo
Advertisement

హెచ్ఎల్సీ కాలువలో దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నం

అనంతపురం: జిల్లాలోని హెచ్ఎల్సీ కాలువలో దూకి ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. కనేకల్లు మండలంలోని హెచ్ఎల్సీ కాలువలో నలుగురు పిల్లలతో కలిసి దూకి తండ్రి ఆత్మహత్య యత్నం చేసాడు. ఇటీవల భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో మాధవయ్య మనస్తాపానికి గురయ్యాడు. నలుగురు పిల్లలతో కలిసి కనేకల్ సమీపంలో హెచ్ఎల్సీ కాలువలో దూకి  మాధవయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  సకాలంలో స్థానికులు స్పందించి వారిని కాపాడారు. ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మాధవయ్య, పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆ కుటుంబానికి ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.  

Advertisement
Advertisement