Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 13 Jul 2022 15:05:20 IST

Yashoda కోసం ‘ఫ్యామిలీమేన్ 2’ టీమ్ ?

twitter-iconwatsapp-iconfb-icon

నాగచైతన్యతో వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన తర్వాత సమంత (Samantha) నుంచి వైవిధ్యమైన చిత్రాలు వస్తున్నాయి. ఆమె మొట్టమొదటి పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ (Shaakunthalam) త్వరలో విడుదల కానుండగా.. ‘ఫ్యామిలీమేన్ 2’ (The Family Man) మేకర్స్.. ఆమెతో మరో వెరైటీ వెబ్ సిరీస్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. వీటితో పాటు సమంతా నటిస్తోన్న మరో డిఫరెంట్ మూవీ ‘యశోద’ (Yashoda). టైటిల్ సాఫ్ట్‌గా ఉన్నా..  సామ్ పాత్ర మాత్రం చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో సమంతాపై ఏకంగా మూడు యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయని టాక్. ఆల్రెడీ ‘ఫ్యామిలీమేన్ 2’ వెబ్ సిరీస్‌లో సమంత చేసిన యాక్షన్ సన్నివేశాలకు అభిమానులు ఆశ్చర్యపోయారు. చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉండే ఆ పాత్ర అలా ఫైట్స్ చేస్తుందని ప్రేక్షకులు ఊహించలేదు. 

ఇప్పుడు అదే ఫ్లేవర్‌ను ‘యశోద’ కి కూడా యాడ్ చేయాలని సామ్ భావిస్తోందట. ఈ క్రమంలో తనకి ‘ఫ్యామిలీమేన్ 2’ సిరీస్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కావాలని డిమాండ్ చేసిందట. దాంతో ఆ సిరీస్ కు పనిచేసిన ఫారెన్ స్టంట్ కొరియో గ్రాఫర్స్‌ను రంగంలోకి దింపారట ‘యశోద’ మేకర్స్‌కు. ఈ యాక్షన్ సీన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండబోతున్నాయని టాక్. క్లైమాక్స్‌కు ముందు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ఉంటుందని, అందులో సమంతా పోరాటాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని వినికిడి. ఈ సినిమాలోని సమంత లుక్ ఒకటి బైటికి వచ్చినా.. సర్ ప్రైజింగ్ లుక్ మరొకటి ఉంటుందని, దాన్ని త్వరలోనే వదలుతారని తెలుస్తోంది. 

‘యశోద’ చిత్రం కోసం సమంత జిమ్‌లో చాలా కష్టపడింది. స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకొని కష్టసాధ్యమైన కసరత్తులు ఎన్నిటినో చేసింది. ఆ ప్రయత్నంలో ఆమె శరీరం ఎంతో స్లిమ్‌గా మారింది. యాక్షన్ సీక్వెన్సెస్ లో చురుగ్గా కదిలే స్థాయిలో ఆమె తన బాడీని మార్చుకోవడం విశేషం. విక్రమ్ చిత్రం ‘పత్తు ఎన్రదుక్కుళ్ళ’ (Pathu Endrathukulla) (తెలుగులో ‘పది’ గా విడుదలైంది.) చిత్రం కోసం సామ్ తొలిసారిగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంది. ఆ తర్వాత ‘ఫ్యామిలీమేన్ 2’ లో యాక్షన్ గాళ్ గా మారింది. ఇప్పుడు ‘యశోద’ కోసం పూర్తి స్థాయిలో యాక్షన్ సీన్స్ చేయనుండడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. మరి ‘యశోద’ గా సామ్.. ఎంత పవర్‌ఫుల్ గా అలరిస్తుందో చూడాలి.    

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement