రైతు భాగస్వామ్యంతోనే వ్యవసాయంలో మంచి ఫలితాలు

ABN , First Publish Date - 2021-06-19T06:43:04+05:30 IST

జిల్లాలోని రైతులు ఖరీఫ్‌, రబీ పంటలను సకాలంలో పూర్తి చేసిన తర్వాత 50 శాతం విస్తీర్ణంలో మూడో పంటగా పప్పు ధాన్యాలు, పచ్చిరొట్ట పైర్ల సాగును బోర్లు కింద వరికి బదులు లాభదాయకమైన ఆరుతడి పంటలను చేపట్టేలా ప్రోత్స హించాలని జిల్లా వ్యవసాయ సలహామండలి తీర్మానించింది.

రైతు భాగస్వామ్యంతోనే వ్యవసాయంలో మంచి ఫలితాలు
జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు

జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మంత్రి కన్నబాబు
భానుగుడి(కాకినాడ), జూన్‌ 18 : జిల్లాలోని రైతులు ఖరీఫ్‌, రబీ పంటలను సకాలంలో పూర్తి చేసిన తర్వాత 50 శాతం విస్తీర్ణంలో మూడో పంటగా పప్పు ధాన్యాలు, పచ్చిరొట్ట పైర్ల సాగును బోర్లు కింద వరికి బదులు లాభదాయకమైన ఆరుతడి పంటలను చేపట్టేలా ప్రోత్స హించాలని జిల్లా వ్యవసాయ సలహామండలి తీర్మానించింది. శుక్రవారం స్థానిక జడ్పీ సమా వేశ మందిరంలో కొత్తగా ఏర్పాటైన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం ఆ మండలి చైర్మన్‌ మోటూరు సాయి ఆధ్యక్షతన జరిగింది. దీనికి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కె టింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖామంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖా మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కాకినాడ ఎంపీ వంగా గీత ముఖ్య అతిథులుగా హాజర య్యారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌, సభ్యులకు ముందుగా వీరంతా అభినం దనలు తెలియజేశారు. అనంతరం మండలి కన్వీనర్‌, జేసీ డాక్టర్‌ జి లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.70 ద్వారా ఏర్పాటు చేసిన జిల్లా, మండల, ఆర్‌బీకే స్థాయి, వ్యవసాయ సలహా మండళ్ల మౌలిక లక్ష్యాలను సభ్యులకు వివరించారు. వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల్లో మార్కెట్‌ డిమాండ్‌, ఆగ్రో, క్లైమాటిక్‌ జోన్‌లకు అనుగుణంగా లాభదాయకమైన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించేలా సపోర్ట్‌ ప్యాకేజీల అమలుకు ప్రభుత్వానికి సూచ నలు చేయడం, నికర వ్యవసాయిక ఆదాయాలను పెంచే ఉత్తమ విధానాలపై వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం, నీటి వనరుల సమర్థ వినియో గం, వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలను విస్తరించడం, ఆహార భద్రత, పౌష్టికత పెంచే పంటల సాగు ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వ్యవసాయం ఉత్పత్తి, డిమాండ్‌ సప్లై మధ్య లోపాల సవరణ తదితర రైతు సంక్షేమ అంశాలపై జిల్లా వ్యవ సాయ సలహా మండలి చర్చించి రాష్ట్ర మండలి ద్వారా ప్రభుత్వానికి సూచనలు చేస్తుందన్నారు. అభ్యుదయ రైతు మోటూరు సాయి చైర్‌పర్సన్‌గానూ, కలెక్టర్‌ వైస్‌ చైర్మన్‌గాను, అన్ని నియోజక వర్గాల నుంచి ప్రోగ్రసివ్‌ ఫార్మర్లు 17 మందితోపాటు జిల్లా మంత్రులు, ఎంపీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌, వాటర్‌ యూజర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్లు, వ్యవసాయ అనుబంధరంగ శాఖల జిల్లా అధికారులతో ఈ మండలి ఏర్పాటైయ్యిందన్నారు. వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు మాట్లాడు తూ రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్‌రెడ్డి వినూత్న ఆలోచనలతో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారన్నారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, వ్యవ సాయశాఖ జేడీ ఎన్‌ విజయ్‌కుమార్‌, డీడీలు వీటి రామారావు, ఎస్‌ మాధవరావు, ఉద్యానవన శాఖ డీడీ ఎస్‌ రామ్మోహన్‌, పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్‌ సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T06:43:04+05:30 IST